సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎంజీ
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (21:31 IST)

పుట్టగొడుగులను తింటే నిత్య యవ్వనంగా ఉండొచ్చు

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే... ఇవి వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయన్న సంగతి మాత్రం మనలో చాలామందికి తెలియదు. నిత్యం యవ్వనంగా ఉండాలంటే మీరు పుట్టగొడుగులు తినాలి. పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ః అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ప్రధానం కారణం.


ఇతర ఉడికించిన కూరగాయల మాదిరిగా పుట్టగొడుగులను ఉడికించినప్పటికీ... వాటిల్లోని యాంటీ ఆక్సీడెంట్ల శాతం ఏమాత్రం మారదు. హానికారక ఫ్రీరాడికల్స్ మనం తీసుకున్న ఆహారం ఆక్సీకరణకు గురైనప్పుడు హానికారక ఫ్రీరాడికల్స్ శరీరంలోకి విడుదలవుతాయి. ఇవి శరీర కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె సంబంధ సమస్యలు, అల్జీమర్స్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. చివరకు డీఎన్‌ఏపై కూడా ఇవి ప్రభావం చూపి, వృద్ధాప్యానికి కారణమవుతున్నాయి.
 
అయితే పుట్టగొడుగుల్లో అధికంగా ఉండే ఎర్గోథియోనిన్, గ్లుటాథియోన్ యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి ఫ్రీరాడికల్స్ ఎక్కువ విడుదల కాకుండా చేస్తాయి. ప్రపంచ ఆహార దినోత్సవం 2021: ఇంట్లో తయారుచేసే ఆహారాలు వేస్ట్ కాకుండా నివారించడానికి సాధారణ చిట్కాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది వేసవికాలంలో పుట్టగొడుగులను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

 
అంతేకాదు వీటిని తినడం వల్ల చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. వీటిల్లో బలవర్థక విటమిన్లకు కొరతే లేదు. ఈ సీజన్లలో బాగా దొరికే పుట్టగొడుగుల వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు.
 
 
పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు. ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి. యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
 
 
పుట్టగొడుగుల్లో బి1, బి2, బి3, బి5, బి9లు  ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది. ఎలర్జీలు, ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇవి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగివుంటాయి. చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి.
 
 
అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది. పుట్టగొడుగులు తీసుకోవడంవల్ల వయసు కనపడదు. ముఖ్యంగా చర్మం కాంతి విహీనం కాదు. స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్‌-డితో పాటు యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. 
 
పుట్టగొడుగుల్లో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ కాబట్టి వాతావరణ కాలుష్యం వల్ల చర్మంపై తలెత్తే ముడతలు, ఎగ్జిమా వంటి సమస్యలను తగ్గిస్తాయి. యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి. వీటిల్లో ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ. వీటిల్లోని పీచుపదార్థాలు, ఎంజైములు కొలెస్ట్రాల్‌ ప్రమాణాన్ని తగ్గిస్తాయి.
 
 
పుట్టగొడుగులు  రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. కాన్సర్లను అరికడతాయి. రొమ్ము, ప్రొస్టేట్‌ కాన్సర్లను అరికట్టడంలో పుట్టగొడుగులు శక్తివంతంగా పనిచేస్తాయి. మధుమేహవ్యాధిగ్రస్థులకు పుట్టగొడుగులు తేలికపాటి ఆహారం. పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఆస్టియోపొరాసిస్‌ తలెత్తదు. రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి.

 
పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. పొటాషియం ఎక్కువ పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధిచెందుతుంది. ఐరన్‌ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి. శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి. గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. పలు విధాలుగా వండుకోవొచ్చు.