గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (20:49 IST)

స్త్రీ పురుషుల్లో శృంగార సమర్థతను పెంచే మెంతికూర.. (video)

మెంతి కూరలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మధుమేహం పరారవుతుంది. ఒక టీస్పూన్ మెంతులు తీసుకుని, పౌడర్ చేసి, గోరువెచ్చని నీటితో మిక్స్ చేసి తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయాబెటిస్ దూరం అవుతుంది. ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మెంతి ఆకులు ఉపయోగపడతాయి. మెంతికూరను పేస్ట్ లాగా తలకు పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. ఆలా చేయడం వల్ల మీకు మృదువైన కేశాలు లభిస్తాయి.
 
స్త్రీలకు మెంతి కూర ఎంతగానో మేలు చేస్తుంది. మెంతికూర తినడం వల్ల మహిళల్లో కనిపించే నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషులు లైంగిక సమర్థతను పెంపొందిస్తుంది. 
 
మెంతులలో కావలసినంత పీచు పదార్దాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్ధాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి.

 
 
మెంతి ఆకులను తినడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెంతి ఆకుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంతో బాగా ఉపకరిస్తాయి. అంతే కాదు ఇవి రక్త హీనతను కూడా దూరం చేస్తాయి. మెంతికూర కడుపు ఉబ్బరాన్ని, కడుపులో మంటను తగ్గిస్తాయి.
 
డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం కొంత కష్టమవుతుంది. అలాంటప్పుడు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. శరీరానికి నీరు వచ్చినవారు మెంతికూరను రోజూ తింటే మంచి గుణం కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.