శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 మార్చి 2017 (12:34 IST)

ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? రోజూ 4 ఆపిల్స్, 2 దానిమ్మ పండ్లు తీసుకోండి

అధికబరువుతో బాధపడుతున్న వారు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువుండేలా చూసుకోవాలి. రోజూ నాలుగు యాపిల్స్, రెండు దానిమ్మ పండ్లు తీసుకోవాలి. అన్నం తగ్గించాలి. రోటీలు తీసుకోవడం ఉత్తమం. కూరగాయలు పచ్చ

అధికబరువుతో బాధపడుతున్న వారు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువుండేలా చూసుకోవాలి. రోజూ నాలుగు యాపిల్స్, రెండు దానిమ్మ పండ్లు తీసుకోవాలి. అన్నం తగ్గించాలి. రోటీలు తీసుకోవడం ఉత్తమం. కూరగాయలు పచ్చిగా తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్‌లో ఉడికించిన ఆలుగడ్డు తీసుకోవాలి. లంచ్‌లో పచ్చి కూరగాయలు, లేదా ఉడికించినవి తీసుకోవచ్చు.  
 
రోజుకు రెండు అరటి పండ్లు, మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. 12 గ్లాసుల నీరు తీసుకోవాలి. పండ్లు, కూరగాయాలతో పాటు బ్రౌన్ రైస్, చిన్న కప్పు పప్పు, గాసు మజ్జిగ తీసుకోవాలి. టమాటోలు, ఆపిల్స్, ఆరెంజ్ పళ్లతో పాటు పండ్ల సలాడ్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌లో గ్రీన్ టీ తాగడం.. సలాడ్స్ తీసుకోవడం మరచిపోకూడదు. ప్రతిరోజూ ఉదయం ఓ గ్లాసుడు గొరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనే, కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.