బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (18:30 IST)

ఆలస్యంగా నిద్రలేస్తే.. మెదడు మొద్దుబారుతుందట.. రోజంతా చురుగ్గా ఉండాలంటే..

ఆలస్యంగా నిద్రలేవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పూట టైమ్‌కు నిద్రించి.. ఉదయం త్వరగా లేవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. రోజంతా పని స

ఆలస్యంగా నిద్రలేవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి పూట టైమ్‌కు నిద్రించి.. ఉదయం త్వరగా లేవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. రోజంతా పని సకాలంలో సవ్యంగా పూర్తి కావాలంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాల్సిందే. 
 
ఉదయాన్నే లేవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు ఉదయం ఐదు గంటలకు లేచిన వారు మిగిలినవారికన్నా చాలా తెలివిగా ఉంటారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. వారికి అలసట తక్కువగా ఉంటుందని కూడా సర్వేలో వెల్లడి అయ్యింది. 
 
ఆలస్యంగా లేచిన వారి మెదడు మొద్దుబారిపోతోందని, వారు ఏ పని చేయాలన్నా బద్ధకం ఆవహిస్తుందని.. అదే ఉదయం పూట నిద్రలేచే వారిలో అలసట వుండదు. తద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారిలో నిద్రలేమి సమస్య వేధిస్తుంది. దీనికి చెక్ పెట్టాలంటే.. రాత్రిపూట తొందరగా పడుకుని.. ఉదయం వేకువజామున లేవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.