బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 20 జనవరి 2023 (12:48 IST)

బీరకాయను ఎందుకు తినాలో తెలుసా?

Ridge Gourd
ప్రతిరోజూ తీసుకునే ఆహార పదార్థాలతో పాటు ఇతర రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. ఉదాహరణకు బీరకాయ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాము.
 
బీరకాయ జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది.
 
బీరకాయ తొక్కను శుభ్రం చేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి.
 
ఆపై మెత్తని పొడిలా తయారుచేసుకుని ఈ పొడిలో కొన్ని ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి మళ్లీ పొడి చేయాలి.
 
ఇలా చేసిన పొడిని రోజుకు ఒక్కసారైనా అన్నంలో కలిపి తీసుకుంటే చలికాలంలో వచ్చే వ్యాధులను నిరోధించవచ్చు.
 
బీరకాయను తింటుంటే మతిమరుపు సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు బీరకాయ తీసుకోవాలి.
 
బీరకాయ తింటుంటే మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి. 
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుడి సలహా తీసుకోవాలి.