బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (23:10 IST)

అధిక రక్తపోటు వున్నవారు తాంబూలం వేసుకుంటే?

Betel Leaf
తమలపాకులతో తాంబూలం సేవించడం చాలామంది చేస్తుంటారు. కానీ తాంబూలం లేదా కిళ్లీని కొన్ని వ్యాధులున్నవారు వేసుకోరాదు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
 
అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు.
 
తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు, ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
 
తమలపాకు, సున్నం, వక్క కాంబినేషన్‌తో చేసే తాంబూలం వల్ల ఉపయోగాలున్నాయి.
 
తాంబూలం వేసుకుంటే ఎముకలు గుల్లబారటం సమస్య రాకుండా ఉంటుంది.
 
ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు స్లిమ్ అవుతారు.
 
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
 
తమలపాకు రిచ్ వాటర్ కంటెంట్. తమలపాకులలో తక్కువ కొవ్వులు మరియు క్యాలరీల సంఖ్యతో అధిక తేమను కలిగి ఉంటుంది.
 
తమలపాకు విటమిన్ సి యొక్క గొప్ప మూలం, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.