అన్నదానం.. లడ్డూ పెట్టి.. తాంబూలంతో దానం చేస్తే..
అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయి. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చును.
కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డూ పెట్టి.. తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉంది.
ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దీర్ఘ రోగాలతో సతమతవుతున్నవారు అన్ని రోగాలు తొలిగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి.
అలాంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడ దానం చేస్తే గృహంపై ఏ విధమైన మంత్ర సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.