బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (20:24 IST)

రోజూ తాంబూలం తీసుకుంటే... ఏంటి ప్రయోజనం..?

తాంబూలం తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. తాంబూలం తీసుకుంటే ఆహారం సులభంగా, తేలికగా జీర్ణమవుతుంది. తద్వారా ఆకలి కూడా చాలా వరకు అదుపులో ఉంటుంది. రాత్రి పూట నానబెట్టిన తమలపాకు నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 
 
తమలపాకుకు కొద్దిగా ఉప్పు, జీలకర్ర కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే తమలపాకు రసంతో పాటు అజ్వైన్ తింటే ఎముకలు దృఢంగా మారతాయి. గొంతునొప్పి సమస్యలకు తమలపాకు రసంలో కొద్దిగా సున్నం కలిపి తీసుకుంటే ప్రయోజనాలు పొందవచ్చు.
 
తమలపాకులు ఆల్కలీన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. తాంబూలంలో నలుపు, తెలుపు రంగులతో కూడినవి వున్నవి, అయితే తమలపాకులను ఉపయోగించినప్పుడల్లా, దాని నుండి కాండం, నరాల భాగాన్ని తొలగించి ఉపయోగించాలి. ఇందులో ఐరన్, ఫైబర్, కాల్షియం, థయామిన్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు ఉంటాయి.