శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 9 సెప్టెంబరు 2017 (11:58 IST)

రాత్రివేళల్లో భోజనం చేశాక వాకింగ్ చేస్తున్నారా?

రాత్రిపూట భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రాత్రిపూట భోజనం చేశాక నిద్రకు ఉపక్రమిస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే నిద్రించేందుకు రె

రాత్రిపూట భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా రాత్రిపూట భోజనం చేశాక నిద్రకు ఉపక్రమిస్తే అనారోగ్య సమస్యలను  కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే నిద్రించేందుకు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. రాత్రివేళల్లో భోజనం చేశాక నిద్రకు ఉపక్రమించడం మంచిది కాదని.. అందుకే కొద్దిసేపు నడవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఇలా వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే అధిక బరువు సమస్య కూడా ఆహారం తీసుకున్నాక పది నిమిషాలు నడవడం ద్వారా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం డయాబెటిస్ రోగులే కాకుండా ఎవరైనా సరే భోజనం తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసి, ఆ తరువాత నిద్రకు ఉపక్రమించడం మంచిదని సూచిస్తున్నారు.
 
అలాగే రాత్రుల్లో ప్రశాంతమైన నిద్ర పొందాలన్నా ఆరోగ్యకరంగా నిద్ర లేవాలన్నా కొన్ని ఆహారాలు రాత్రుల్లో తినడం మానుకోవడంతో పాటు, రాత్రివేళ బోజనం మితంగా తినాలి. పొద్దున పూట కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు కానీ రాత్రి పూట మాత్రం కడుపులో కొంచెం ఖాళీ ఉండగానే కంచం ముందు నుంచి లేవటం మంచిది. పడుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది.