శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (18:43 IST)

వేసవిలో తాటి ముంజలు తప్పక తినాలి.. లేకుంటే...?

వేసవిలో లభ్యమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మామిడి, తాటిముంజలు తప్పక డైట్‌లో చేర్చుకోవాలి. తాటిముంజలు వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చికెన్ పాక్స్‌తో బాధపడేవారు తాటి ముంజలు తింటే శర

వేసవిలో లభ్యమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మామిడి, తాటిముంజలు తప్పక డైట్‌లో చేర్చుకోవాలి. తాటిముంజలు వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. చికెన్ పాక్స్‌తో బాధపడేవారు తాటి ముంజలు తింటే శరీర తాపం తగ్గుతుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. తాటి ముంజలు తీసుకోవడం ద్వారా తినడం వల్ల బరువు తగ్గుతారు. తాటిముంజల్లో నీటిశాతం అధికంగా వుండటం ద్వారా ఆరోగ్యానికి కావలసిన తేమను అందుస్తుంది. 
 
తాటిముంజల్లో ఐరన్‌, క్యాల్షియం వీటిల్లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌-ఎ, బి, సిలతో పాటు జింక్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌లు కూడా అధికంగా ఉంటాయి. వేసవిలో రోజూ తాటి ముంజలు తింటే వడదెబ్బ తగలనీయకుండా బయటపడవచ్చు. గర్భిణీ మహిళలకు జీర్ణక్రియను తాటి ముంజలు మెరుగుపరుస్తాయి. ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తాయి.
 
వేసవిలో అలసటను తాటిముంజలను దూరం చేస్తాయి. తాటిముంజల్లో అధికశాతం పొటాషియం ఉండడం వల్ల కాలేయ సమస్యలు తగ్గుతాయి. వేసవిలో మహిళలను వేధించే తెల్లబట్ట సమస్యను తాటిముంజలతో తొలగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.