గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2022 (20:18 IST)

తేనెలో నానబెట్టిన చిన్న ఉల్లిపాయలు తింటే...? (video)

Honey Onion
Honey Onion
తేనెలో నానబెట్టిన చిన్న ఉల్లిపాయలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చిన్న ఉల్లిపాయలు రక్తంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తేనెలో నానబెట్టి తింటే దాని ప్రయోజనాలు మరింత ఎక్కువ. చిన్న ఉల్లిపాయలను తొక్క తీసి డబ్బాలో వేసి, అది మునిగిపోయేంత వరకు తేనె పోసి రెండు రోజులు ఉంచాలి. ఇందులో ఒక చెంచా తేనె కలిపి ఉదయాన్నే తినాలి. 
 
చిన్న ఉల్లిపాయలు రక్తంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. అంతేగాకుండా రక్తంలోని టాక్సిన్స్ సులభంగా తొలగిపోయి శుద్ధి అవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా ఎల్లప్పుడూ ఛాతీలో శ్లేష్మం చేరడాన్ని నివారిస్తుంది. ఇంకా ఊపిరితిత్తులకు హాని కలిగించదు. 
 
శ్వాసకోశ సమస్యలను దరి చేర్చదు. తేనెలో నానబెట్టిన ఉల్లిపాయ శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో కూడా మేలు చేస్తుంది. అలాగే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడంలోనూ తేనెలో నానబెట్టిన చిన్నఉల్లి భేష్‌గా పనిచేస్తుంది.