మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 ఆగస్టు 2022 (23:26 IST)

వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి తింటే...

1. మధుమేహం ఉన్నవారు వంకాయ వలన అన్నం కొద్దిగా తినడము వల్ల దీనిలోని పీచుపదార్థం మూలాన చెక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
 
2. వంకాయ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది, అలాగే వంకాయను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, కఫము వంటి సమస్యలు తగ్గుతాయి.
 
3. వంకాయ రసము నుండి తయారు చేసిన ఆయింట్‌మెంట్లు, టించర్లు, మూలవ్యాధి నివారణలో వాడుతుంటారు. కాబట్టి తరుచుగా వంకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి.
 
4. వంకాయను ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం వేళ తింటే మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి మందు.
 
5. వంకాయ సూప్, ఇంగువ, వెల్లుల్లితో తయారుచేసిన మిశ్రమాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే కడుపు ఉబ్బరము జబ్బు నయమవుతుంది.