శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (10:47 IST)

అది ఎక్కువైనా, తక్కువైనా వీర్య నాణ్యతకు ముప్పే.. నిద్రకు 2 గంటల ముందే?

పురుషుల్లో నిద్రతగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు గంటల కంటే తక్కువ, 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గినట్లు పరిశోధనలో

పురుషుల్లో నిద్రతగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరు గంటల కంటే తక్కువ, 8 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గినట్లు పరిశోధనలో తేలింది. కానీ ఏడు నుంచి 8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగున్నట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. 
 
పురుషులు ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం ఆరోగ్యానికి హానికరమని.. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌.. యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, త్వరగా నిద్రించడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అందుచేత రాత్రిపూట 9.30లోపు నిద్రించేందుకు పురుషులు సిద్ధం కావాలని.. నిద్రకు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలని.. అరగంట ముందు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు కట్టేయాలి. నిద్రించే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం.. ప్రశాంతమైన, మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే సంగీతాన్ని వినాలని చెపుతున్నారని సూచిస్తున్నారు.