మానసిక ఒత్తిడితో బాధపడేవారికి...?
మానసిక ఒత్తిడి కారణంగా మనిషి అనేకరకాల రుగ్మతలకు గురవుతున్నాడు. దాంతోపాటు చికాకు, నిద్రలేమి, ఆందోళన వంటివి మనిషిని వేధిస్తున్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మానసిక ఒత్తిడి వలన మనిషి జ్ఞాపకశక్తి నశించే అవకాశముందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కొందరు పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల ప్రకారం దీర్ఘకాలికంగా ఒత్తిడితో బాధపడేవారికి జ్ఞాపకశక్తి నశించిపోతోందని తేలింది.
అలానే ఒత్తిడి వలన కలిగే ఆందోళన, మానసికంగా కుంగిపోవడం వంటి లక్షాణాలు మనిషిలోని విషయ సంగ్రహణ శక్తిని దెబ్బతీస్తాయని కూడా ఈ పరిశోధనలు తెల్చాయి. ఈ పరిశోధనల ప్రకారం మానసిక వ్యధకు, విషయ సంగ్రహణ శక్తికి మధ్య సంబంధం ఉన్నట్టు తేలింది. కాబట్టి జీవితంలో అనేక రుగ్మతలతో పాటు జ్ఞాపకశక్తి నాశనానికి సైతం దారితీసే ఈ మానసిక ఒత్తిడిని జయించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిందిగా వారు సూచిస్తున్నారు. అలానే ఆహ్లాదకరమైన వాతావరణంలో నివశించడం జీవితంలో ఎదురయ్యే సవాళ్ల గురించి పాజిటీవ్‌గా ఆలోచించడం వంటివి చేయాలని వారు పేర్కొంటున్నారు.