మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 7 జులై 2019 (18:34 IST)

కొర్రలతో అంబలిని ఆవకాయతో టేస్ట్ చేస్తే..?

చిరు ధాన్యాలతో ఒకటైన కొర్రలతో అంబలి తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పుష్కలంగా పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ రోగులకు కొర్ర బియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది. ఉదరసంబంధ సమస్యలకు కొర్ర బియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. 
 
కడుపులో నొప్పి ఆకలి లేకపోవడం అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది. జీర్ణనాళాన్ని శుభ్రం చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర వహిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అలాంటి కొర్రలతో అంబలి చేసుకుని తాగడం ఎలాగో చూద్దాం.. కొర్రలను ముందు రోజు రాత్రి శుభ్రం చేసుకుని నీటిలో నానబెట్టాలి. ఉదయం పూట తగినంత నీటిలో కొర్రలను ఉడికించి అంబలిలా కాచుకోవాలి. తగినంత ఉప్పును చేర్చుకోవాలి. 
 
కొర్రల గంజి, అంబలి చేసుకోవడానికి మట్టి కుండలు శ్రేష్టమైనవి అంబలి త్రాగే ముందు, మిరియాలు లేక జీలకర్ర లేక వాము పొడులను కలుపుకుని తీసుకోవచ్చు. అలాగే పెరుగు, మజ్జిగను కూడా చేర్చుకోవచ్చు. ఇంకా ఆవకాయతో కొర్రల అంబలిని సేవిస్తే టేస్ట్ అదిరిపోతుంది.