సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 19 డిశెంబరు 2017 (21:57 IST)

మీరు రాత్రి సమయంలో పుట్టారా.. అయితే ఖచ్చితంగా ఇది చదవాల్సిందే..

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన వారు ఉంటారు. ఇంకా అసలు తెలివిలేని వారు చాలామందే ఉంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్నకొద్దీ వస్తాయి. ఇక తెలివి

ప్రపంచంలో పుట్టిన మనుషులందరిలోను బాగా తెలివైన వారు కొందరు ఉంటారు. అలాగే కొంచెం తెలివైన వారు ఉంటారు. ఇంకా అసలు తెలివిలేని వారు చాలామందే ఉంటారు. అయితే కొంతమందికి పుట్టుకతోనే అమితమైన తెలివితేటలు వస్తాయి. కొందరికి అవి పెరుగుతున్నకొద్దీ వస్తాయి. ఇక తెలివితేటల విషయంలో ఎవరు ఎలా ఉన్నా రాత్రిపూట పుట్టిన వారు మాత్రం సహజంగానే ఇతర సమయాల్లో పుట్టిన వారి కంటే ఎక్కువ తెలివితేటలను కలిగి ఉంటారట. మీరు విన్నది నిజమే. పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్న నిజమిది. 
 
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు వ్యక్తులను, వారు పుట్టిన సమయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వారి విజ్ఞానం, చదువు, తెలివితేటలు, ఐక్యూ స్థాయిలను కూడా పరిశీలించారు. దీన్ని మొత్తం బేరీజు వేసుకున్న తరువాత రాత్రి పూట పుట్టిన వారు బాగా తెలివిమంతులు అవుతారని, వారికే ఐక్యూ ఎక్కువగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. 
 
రాత్రి పూట పుట్టేవారికి తెలివితేటలే కాదు.. సమస్యను పరిష్కరించే సత్తా కూడా ఉంటుంది. వీరు చదువుల్లో రాణిస్తారు. గొప్ప ఉద్యోగాలు చేస్తారు. సాధారణంగా రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర కావాలి కదా. కానీ రాత్రిపూట పుట్టిన వారికి ఐదు గంటల నుంచి 6 గంటల నిద్ర ఉన్నా సరిపోతుంది. వీరికి ఎక్కువ నిద్ర అవసరం లేదు. పనిలో బాగా చురుగ్గా ఉంటారు. ఎక్కువగా పనిచేస్తారు.