బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (10:20 IST)

సంతాన సాఫల్యతను పెంచడానికి.. వీటిని తినాల్సిందే..?

అంజీర ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. తరచు దీనిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంజీరపండులో విటమిన్స్, పీచు పదార్థాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి అంజీర మంచి టానిక్‌లా పనిచేస్తుంది. అంజీరలోని మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
కప్పు అంజీర పండు ముక్కల్ని భోజనానికి ముంది తీసుకోవడం వలన పొట్ట తొందరగా నిండిపోతుంది. దాంతో అతిగా తినే సమస్య తగ్గుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అజీరపండు తింటే.. శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. రక్తహీనత ఉన్నవారు నిత్యం అంజీర తింటే మంచిది. 
 
నోటి దుర్వాసనకు చెక్ పెట్టాలంటే.. రాత్రివేళ నిద్రక ఉపక్రమించే ముందు రెండు అంజీర పండ్లను తింటే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అంజీర పండు తింటే విటమిన్ ఎ, బి, బి12 అధిక మొత్తంలో లభ్యమవుతాయి. ఎముకలను దృఢంగా చేస్తాయి. పిల్లలు లేనివారు, పిల్లల్ని కనాలనుకుంటున్నవారు నిత్యం ఆహారంతో పాటు అంజీరను కూడా తినాలి. ఇందులోని జింక్, మెగ్నిషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు సంతాన సాఫల్యతను పెంచడానికి సహకరిస్తాయి. 
 
రోజూ ఈ పండుని ఉదయం, రాత్రివేళ తింటే మలబద్దకం సమస్య దూరం చేస్తుంది. ఇప్పటి వేసవికాలంలో ఏర్పడే శరీర వేడిని తగ్గించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా తేడా కనిపించలేదా.. అయితే.. కప్పు అంజీర పండ్లు రోజూ తినండి.. తప్పక ఫలితం ఉంటుంది. అంజీర పండులో శరీర ఎనర్జీని పెంచే పోషకాలు అధిక మోతాదులో ఉన్నాయి.