శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:55 IST)

నల్ల ఉప్పులో గుడ్డు వాసన.. టమోటా రసంలో కలిపి తాగితే?

Black salt
Black salt
నల్ల ఉప్పులో సముద్రపు ఉప్పు కంటే తక్కువ సోడియం ఉంటుంది. నల్ల ఉప్పు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు మరియు నేపాల్ నుంచి తీసుకుంటారు. ఇందులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. మలబద్ధకం ఉన్నవారు నీటిలో కొద్దిగా నల్ల ఉప్పును కరిగించి అందులో అల్లం, నిమ్మరసం కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. 
 
బ్లాక్ సాల్ట్ గుడ్డు వాసన కలిగి ఉంటుంది. కాబట్టి శాకాహారులు ఈ ఉప్పును ఇష్టపడరు. ఈ ఉప్పులో గుడ్డులోని అన్ని గుణాలూ ఉన్నాయి, వాసనే కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఒక పిడికెడు ఉప్పును తీసుకుని బాణలిలో వేయించి, గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న ప్రదేశాల్లో మర్దన చేస్తే కీళ్ల నొప్పులు మాయమవుతాయి.
 
రోజూ టమోటా రసంలో నల్ల ఉప్పు కలిపి తాగితే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు. స్నానం చేసే నీటిలో నల్ల ఉప్పు కలిపి స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. పాదాలు వాచి, పగుళ్లు ఉన్నట్లయితే వేడినీళ్లలో కాస్త నల్ల ఉప్పు కలిపి పాత్రలో నింపి పాదాన్ని నీటిలో మునిగేలా ఉంచితే వాపు తగ్గుతుంది.