శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:17 IST)

రాత్రిపూట ఉడికించిన కోడిగుడ్డు తింటే?

పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి ఎంతగానో తోడ్పడతాయి. జీర్ణశక్తికి దోహదపడే ప్రొ-బయోటిక్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో కెలొరీల సమస్యేలేదు. వేసవిలో పెరుగు తీసుకోవడం ద్వారా చల్లదన

పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి ఎంతగానో తోడ్పడతాయి. జీర్ణశక్తికి దోహదపడే ప్రొ-బయోటిక్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో కెలొరీల సమస్యేలేదు. వేసవిలో పెరుగు తీసుకోవడం ద్వారా చల్లదనం వల్ల చురుగ్గా అనిపిస్తుంది. కీరా, క్యారెట్‌లు వేసవిలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. ఆకలి అదుపులో ఉండి కడుపునిండిన భావన కలుగుతుంది.

పైగా శరీరంలోని నీటిశాతం తగ్గదు. అర్థరాత్రి మేల్కొని ఉండటం వల్ల కళ్లు ఎర్రబారడం, వేడిచేయడం వంటి సమస్యల్ని తగ్గించొచ్చు. సన్నగా తరిగిన క్యారెట్లు కూడా ఇదే ఫలితాన్నిస్తాయి. 
 
అలాగే రాత్రి పూట ఉడికించిన గుడ్డును తీసుకోవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా అందుతాయి. అప్పటికప్పుడే ఆకలి తీరుతుంది. చక్కగా ఆమ్లెట్‌ వేసుకోవచ్చు.. కానీ నూనె కాస్తంత చూసి వాడాలి. అలాగే రాత్రిపూట ఉప్పు శాతం ఎక్కువగా ఉండే బంగాళాదుంప చిప్స్‌ కన్నా పాప్‌కార్న్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. వాటిని ఇంట్లోనే తయారుచేసుకుని.. కొద్దిగా ఉప్పు చల్లుకుంటే చాలు. కెలొరీల సమస్య ఉండదు. తేలిగ్గా అరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.