శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 జనవరి 2021 (23:09 IST)

టమోటాలు తింటే ఆ సమస్య వస్తుందా?

టమోటా విత్తనాల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా టమోటా విత్తనాలను ఎండిన తర్వాత వినియోగించడం జరుగుతుంటుంది, దీనిని పౌడర్ రూపంలో మరియు టమోటా గింజల నూనె రూపంలో వినియోగించడం జరుగుతుంటుంది. 
 
వీటిలో అద్భుతమైన సౌందర్య మరియు జీర్ణ సంబంధమైన ప్రయోజనాలు దాగున్నాయి. వాస్తవానికి టమోటా గింజల వెలుపలి భాగం కఠినతరంగా ఉంటూ, జీర్ణక్రియలకు అంతరాయం కలిగించేలా ఉంటాయి. అయితే మీ పేగుల్లో ఉన్న జీర్ణాశయ సంబంధిత ఆమ్లాలు గింజల వెలుపలి పొరను జీర్ణం చేసి, ఆ తర్వాత మలం ద్వారా శరీరం నుండి వ్యర్దాలను తొలగిస్తాయి. 
 
టమోటా గింజల వలన అపెండిసైటిస్ సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. నిజానికి విటమిన్ - ఎ మరియు విటమిన్ - సి సమృద్ధిగా ఉండే ఈ విత్తనాలు, డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలకు గొప్ప మూలంగా కూడా చెప్పవచ్చు. అపెండిసైటిస్ సమస్యకు ఇవి ఏమాత్రం కారణం కాజాలదని గుర్తుంచుకోండి. టమోటా విత్తనాల వెలుపలి భాగంలో కనిపించే సహజ సిద్ధమైన జెల్ మీ రక్తప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. 
 
ఇది రక్తం గడ్డకట్టకుండా చేయడంలో మరియు రక్త నాళాల ద్వారా మీ రక్తం సజావుగా ప్రవహించడంలో సహాయం చేస్తుంది. అధిక రక్తపోటు మరియు ఇతర హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు, తరచుగా వైద్యుల సలహా మేరకు ఆస్పిరిన్ టాబ్లెట్లను తీసుకుంటుంటారు. ఇవి ఉపశమనం కలిగించినప్పటికీ దీర్ఘకాలం వాడటం వలన అల్సర్స్ వంటి దుష్ప్రభావాలను కలిగిస్తాయి. 
 
వీటికి ప్రత్యామ్నాయంగా టమోటా విత్తనాలను తీసుకోవచ్చు. ఈ గింజలలో ఉండే లక్షణాల వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని కొంత మంది సూచన. టమోటా విత్తనాలలో తగినంత మోతాదులో పీచు పదార్థాలు ఉన్న కారణంగా, జీర్ణక్రియలకు ఎంతో ఉత్తమంగా సహాయపడగలదని చెప్పబడింది. అయితే వీటి వలన దుష్ప్రభావాలు కూడా కొన్ని ఉన్నాయి. 
 
టమోటా గింజల్ని అధిక మోతాదులో తీసుకుంటుంటే, వాటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశముందని శాస్త్రీయంగా పేర్కొన్నప్పటికీ ఒక పరిమిత మోతాదు వరకు తీసుకోవచ్చని చెప్పబడుతుంది. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న వ్యక్తికి మాత్రం, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ టమోటా విత్తనాలను సూచించడం జరగదు. డైవర్టిక్యులిటిస్ సమస్యతో ఉన్న వ్యక్తులు టమోటా విత్తనాలను వినియోగించకూడదని సలహా ఇవ్వబడుతుంది. పెద్ద పేగులో సంచులు ఏర్పడడం, వాపును తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్నాయి