శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (15:48 IST)

నేరేడు పండ్లలో బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే?

నేరేడుపండ్లలో సహజంగా ఉండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లను స్రవించేలా చేసి కాలేయం పనితీరుని మెరుగుపరుస్తాయి. జీలకర్రపొడి, బ్లాక్‌సాల్ట్‌తో కలిపి తింటే నేరేడు పండ్లను తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుంద

నేరేడుపండ్లలో సహజంగా ఉండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్‌లను స్రవించేలా చేసి కాలేయం పనితీరుని మెరుగుపరుస్తాయి. జీలకర్రపొడి, బ్లాక్‌సాల్ట్‌తో కలిపి తింటే నేరేడు పండ్లను తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది. కాలేయవ్యాధులకి నేరేడు పండ్లు ఉపశమనాన్నిస్తాయి. 
 
విటమిన్‌-ఎ, విటమిన్‌-సి సమృద్ధిగా ఉండే నేరేడుపండులో డయాబెటిస్‌ను తగ్గించే ఔషధగుణాలు పుష్కలంగా వున్నాయి. రక్తంలో పేరుకునే చక్కెరకి నేరేడుని మించిన విరుగుడు లేదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఉదయాన్నే ఉప్పు లేదా తేనెతో కలిపి ఈ పండ్లను తింటే పైల్స్‌ వ్యాధి తగ్గుతుంది. ఈ పండ్లలో పుష్కలంగా ఉండే ఐరన్‌ రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. నేరేడు పండ్ల గుజ్జు దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధుల్నీ తగ్గిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే అతిసారం, కలరా వ్యాధులతో పాటు ఇతరత్రా ఇన్ఫెక్షన్లను నేరేడు అరికడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కానీ నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు. నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి. 
 
రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.