శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (11:24 IST)

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? వినికిడి లోపం తప్పదండోయ్..!

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? బడ్స్ ద్వారా ఇయర్ వాక్స్ తొలగించడం ద్వారా కొన్నిసార్లు చెవిలోని సున్నితభాగాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్‌ వాక్స్‌ అనేది కొన్ని రోజుల తరువాత దానం

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? బడ్స్ ద్వారా ఇయర్ వాక్స్ తొలగించడం ద్వారా కొన్నిసార్లు చెవిలోని సున్నితభాగాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్‌ వాక్స్‌ అనేది కొన్ని రోజుల తరువాత దానంతట అదే బయటకు వచ్చేస్తుందనీ, ప్రత్యేకించి దానిని తీసేయవలసిన అవసరం లేదంటున్నారు. ఇలా తీసివేసే క్రమంలో కొన్నిసార్లు కర్ణభేరి దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
 
ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ డివైస్‌ల వల్ల చెవిపోటు తప్పదట. మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడటం ద్వారా ఐపాడ్స్, ఎంపీ3 ప్లేయర్స్, కంప్యూటర్లు, టాబ్స్ వంటి అత్యాధునిక పరికరాల వల్ల చెవికి, కంటికి దెబ్బేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్‌బడ్స్‌ ఉపయోగించడం వలన అమెరికాలో ప్రతిరోజు సుమారు 34 మంది గాయపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారట. 
 
వీరందరూ నాలుగునుంచి ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు కావడం గమనించవలసిన అంశం. ఇయర్ బడ్స్ ఉపయోగించడం ద్వారా కర్ణభేరి దెబ్బతింటుందని.. దీంతో వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతాయట. అలాగే ఐపాడ్, ఎంపీ3 డివైస్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.