ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు
ప్యాకేజ్డ్ జ్యూస్‌లు ఆరోగ్యకరమైనవి అనే లేబుల్‌తో వస్తుంటాయి. అవి ఆరోగ్యానికి ప్రమాదకరమని.. వాటిలో పోషక విలువలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ పోషకాహార వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు నిర్వహిస్తారు.
ఈ సంవత్సరం థీమ్ 'అందరికీ పోషకాలతో కూడిన ఆహారం'. ప్యాక్ చేయబడిన జ్యూస్‌లు సాధారణంగా తక్కువ పండ్ల గుజ్జును కలిగి ఉంటాయి. వాటిలోని అధిక చక్కెర కంటెంట్ కారణంగా అవి అనారోగ్యకరమైనవి. ఇంకా మధుమేహం, ఊబకాయం ప్రమాదాన్ని కలిగిస్తాయి.
ప్రాసెస్ చేసిన రసంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా వుండవు. ప్యాకేజ్డ్ జ్యూస్‌లు అస్సలు ఆరోగ్యకరమైనవి కావు. ఇందులో కృత్రిమ రుచులు, స్టెబిలైజర్లు, చక్కెర, స్వీటెనర్లు, ఫ్రక్టోజ్ సిరప్ సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటికి బదులు తాజా పండ్ల రసాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.