కరోనా నుంచి కోలుకున్నాక ప్రాణాయామం చేయొచ్చా?

pranayama
ఠాగూర్| Last Updated: మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:45 IST)
సాధారణంగా కరోనా వైరస్ బారిన కోలుకున్న వారికి ఊపిరితిత్తులు ఎంతోకొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్ధ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే, పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్‌ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడవలసి ఉంటుంది.

ముఖ్యంగా, కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఊపిరితిత్తులను బలపరిచే ప్రాణాయామం చేయడం సరికాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌తో బలహీనపడిన ఊపిరితిత్తులు ప్రాణాయామంలో తీసుకునే వేగవంతమైన శ్వాస ప్రక్రియలతో మరింత అసౌకర్యానికి లోనవుతాయి.

బలంగా, వేగంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాలతో ఊపిరితిత్తుల మీద పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రారంభంలో అలోమ, విలోమ వ్యాయామాలు చేయడం మేలు. ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకుని, ప్రాణాయామానికి అనువుగా మారినట్టు వైద్యులు ధ్రువీకరించిన తర్వాతే భస్త్రిక వంటి ప్రాణాయామ ప్రక్రియలను సాధన చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.దీనిపై మరింత చదవండి :