శీతాకాలంలో పుదీనా ఆకులు తప్పనిసరి..

సెల్వి| Last Updated: శనివారం, 11 జనవరి 2020 (11:31 IST)
శీతాకాలంలో పుదీనా ఆకులను ఆహారంలో భాగం చేసుకోవాలి. పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుంది. పుదీనా వాసన పీల్చడంతో తలనొప్పులు తగ్గడంతో పాటు, పూడుకుపోయిన సైనస్‌ గదులు శుభ్రమవుతాయి. మైగ్రేన్‌ సమస్య తగ్గిపోయేలా చేస్తుంది. నాణ్యమైన నిద్రకు బాగా ఉపయోగపడుతుంది.

పుదీనా ఆకులతో టీ చేసుకొని తాగితే రక్తం శుద్ధి చేసే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ పుదీనా ఆకుల టీ తీసుకుంటే రోగ నిరోధకవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పుదీనా ఆకు రసంతో శరీర బరువు తగ్గడంతో పాటు.. అందులోని ప్రత్యేకమైన సువాసన మెదడులో సానుకూలంగా ప్రభావితం అవకాశం ఉంది.

అలాగే అందులోని ఔషధ గుణాలతో పాటు, జీర్ణ ప్రక్రియను సమర్ధ వంతంగా నడిపించే పోషకాలూ అధికమే పుదీనాలో ఉన్నాయి. జలుబుతో సతమతమవుతున్నా కప్ఫు పుదీనా చాయ్ తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :