సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (15:00 IST)

ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టే ముల్లంగి.. కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గిపోతుంది తెలుసా?

ముల్లంగిలో కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, జింక్, విట‌మిన్ సి వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల ముల్లంగిని తింటే మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. హైబీపీ, ఇన్‌ఫెక్ష‌న్లు ఉన్న‌వారు ముల్లంగి తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే లివర్‌లో ఉండే విష ప‌దార్థాలు బ‌య‌టకు వెళ్లిపోతాయి.
 
ముల్లంగిలో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు కూడా త‌గ్గుతారు. శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.
 
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి. గుండె స‌మస్య‌లు ఉన్న‌వారు నిత్యం ముల్లంగి తింటే ఎంతో మంచిది. అలాగే మ‌ధుమేహం ఉన్న‌వారు ముల్లంగిని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి.