మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (17:31 IST)

ఒత్తిడిలో ఉన్నప్పుడు అవి తిన్నారో.. అంతే సంగతులు...

రాత్రిపూట జంక్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినే అలవాటుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే పర్

రాత్రిపూట జంక్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినే అలవాటుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే పర్లేదు కానీ.. ఆకలి వున్నా, లేకున్నా, వేళకానీ వేళల్లో తినేవారిలో.. అలాగే ఒత్తిడిలో ఉన్నప్పుడు బర్గర్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్ తినేవారిలో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా రాత్రివేళల్లో జంక్ ఫుడ్‌ను తీసుకుంటే.. నిద్రలేమి సమస్య తప్పదు. దాని ప్రభావం మరుసటి రోజుపై కూడా పడుతుంది. అదే ఒత్తిడిలో ఉన్నప్పుడు తృణధాన్యాలు, మొలకెత్తిన గింజలు, సలాడ్లు వంటివి తీసుకుంటే భావోద్వేగాలను జయించవచ్చు. 
 
కార్యాలయాల్లో పనిభారం, ఒత్తిడి, ఆందోళన కారణంగా తిండిపై దృష్టి మళ్లుతుంది. ఇంకా పనిలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు తిండిని ఆశ్రయించడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఒత్తిడిగా ఉన్నప్పడు.. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్ తీసుకుంటే.. వైద్య ఖర్చులు అమాంతం పెరిగిపోతాయని వారు హెచ్చరిస్తున్నారు.