బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (15:33 IST)

రోజూ ఓ కప్ పాలకూరను తీసుకుంటే? ఒబిసిటీ, రక్తపోటు మటాష్..

పాలకూరను రోజూ ఒక కప్ తీసుకోవడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రోజూ ఒక కప్పు ఆకుకూరను ఇవ్వడం ద్వారా వారి శరీరంలోని ఎముకలు బలపడతాయి. పాలకూరల

పాలకూరను రోజూ ఒక కప్ తీసుకోవడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు రోజూ ఒక కప్పు ఆకుకూరను ఇవ్వడం ద్వారా వారి శరీరంలోని ఎముకలు బలపడతాయి. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుచేత దీనిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తపోటును దూరం చేసుకోవచ్చు. ఇంకా గుండెపోటు వంటి హృద్రోగ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
 
అలాగే ఒబిసిటీతో బాధపడేవారు పాలకూరను రోజూ ఓ కప్పు తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇందులో విటమిన్ ఎ, కే,ఇలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అంటువ్యాధులను దూరం చేస్తాయి. కిడ్నీ సమస్యలను నయం చేస్తాయి. అజీర్ణ సమస్యలు దరిచేరవు. ఇందులో పీచు అధికంగా ఉండటం ద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. 
 
పాలకూరలోని విటమిన్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖంపై గల మచ్చలను తొలగిస్తాయి. చర్మం పొడిబారనీయకుండా చేస్తాయి. అంతేగాకుండా.. చర్మ సమస్యలు, ముడతలకు చెక్ పెడుతాయి. ఒక కప్ ఉడికించి పాలకూరను ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఇందులోని విటమిన్ కె ఎముకలకు బలాన్నిస్తుంది. మహిళల్లో క్యాల్షియం లోటును పూర్తి చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.