మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 24 మార్చి 2021 (22:00 IST)

మట్టికుండలోని మంచినీళ్లు తాగితే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? (video)

ఇపుడయితే రిఫ్రిజిరేటర్లు వచ్చేశాయి. అలా వేసవి ఎండకి బయటకు వెళ్లి లోపలికి రాగానే ఫ్రిజ్ లోని చల్లటి నీళ్లు తాగేస్తుంటారు. కానీ మట్టికుండలోని మంచినీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీటి నుండి లభించే విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీరు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది. చల్లటి నీరు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడుతుంది. అధిక వేడి కారణంగా వచ్చే సమస్యలను నివారించవచ్చు. మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీరు త్రాగటం ఆరోగ్యకరమైన పద్ధతి.
 
మానవ శరీరం ప్రకృతిలో ఆమ్లమైనది, మట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉన్నాయి. మట్టి కుండలలో నిల్వ చేసిన నీరు త్రాగటం వల్ల శరీరం పిహెచ్‌ని నిలబెట్టవచ్చు. ఆమ్లత్వం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను అడ్డుకుంటుంది. మట్టి కుండలలో నిల్వ చేసిన నీరు కూడా తగిన విధంగా చల్లగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
 
వేసవిలో గొంతు నొప్పికి చికిత్స చేయడానికి ఒక మట్టి కుండ నుండి వచ్చే నీరు గొప్ప మార్గం. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీరు వినియోగానికి చాలా వేడిగా ఉంటుంది, రిఫ్రిజిరేటర్ నుండి తీసుకునే నీరు చాలా చల్లగా ఉంటుంది. గొంతునొప్పి లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు మట్టి కుండలో వుంచిని నీరు త్రాగాలి. ఎందుకంటే ఇది చాలా చల్లగా లేదా వేడిగా ఉండదు. పోషకాలు కూడా అధికంగా ఉంటుంది.
 
జీర్ణక్రియను మెరుగుపరచడంలో, జీవక్రియను వేగవంతం చేయడంలో హైడ్రేషన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నీటిని ఒక మట్టి కుండలో నిల్వ చేసినప్పుడు అందులో ఎలాంటి రసాయనాలు చేరే అవకాశం లేదు. కానీ ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ వుంచి తాగే మంచినీటి వల్ల సమస్య తలెత్తే అవకాశం వుంటుంది. కనుక వేసవిలో మట్టికుండలో మంచినీళ్లు తాగడం మంచిది.