మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (11:40 IST)

టీ తాగండి.. గుండెపోటుకు చెక్ పెట్టండి.. కొలెస్ట్రాల్ తగ్గాలంటే..?

టీ త్రాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బాగుంటుంది. మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది. టీ త్రాగడంవల్ల క్యాన్సర్‌ వ్యాధి ఏర్పడే అవకాశ

టీ త్రాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియ బాగుంటుంది.
 
మెదడులో రక్తప్రసరణ చక్కగా జరిగేలా చేస్తుంది. మెదడుకు చురుకుదనం కలిగిస్తుంది. 
 
టీ త్రాగడంవల్ల క్యాన్సర్‌ వ్యాధి ఏర్పడే అవకాశం తక్కువని డాక్టర్లు నిర్ధారించారు. నిద్రమత్తును, సోమరితనాన్ని తొలగిస్తుంది. 
 
టీ త్రాగడం వల్ల గుండెపోటుకు గురికాకుండా కాపాడుతుంది. టీలో నిక్షిప్తమైన ప్లేవనోయిడ్స్‌ రక్తాన్ని గడ్డకట్టనీయకుండా కాపాడుతుంది.
 
టీలో అల్లం ముక్కను చితక్కొట్టివేసి ఆ టీని త్రాగితే అరుచిని పోగొడుతుంది. అజీర్ణ సమస్యలను పోగొడుతుంది. గరం మసాలా టీ త్రాగితే జలుబు, గొంతు నొప్పి తగ్గిపోతాయి. గొంతు గరగర నుంచి కాపాడుతుంది. అయితే మితంగా తాగడమే మంచిది.
 
మానసిక శారీరక అలసటను తొలగిస్తుంది. బ్లాక్‌ టీ రక్తంలోని కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. నాడి వేగం పెరగకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
 
ఆస్తమా రోగులు టీ త్రాగడంవల్ల చక్కని ఫలితముంటుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మెదడును ఉత్తేజితం చేసి పనులను ఉత్సాహంగానూ, చురుకుగానూ చేయించగలుగుతుంది.