శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2017 (20:36 IST)

తేనీరు సేవనం.. క్యాన్సర్ దూరం దూరం

మంచి ఆహారం, కంటికి నిండా నిద్రా అంటే సరిపడా నిద్ర ఉంటే జీవితం సంతోషమయం అవుతుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే తినే తిండి విషయంలో, తాగే ద్రవ పదార్థాల విషయంలో కాసిన్ని చిట్కాలు తీసుకుంటే రోగాలకు దూరంగా ఆరోగ్యవంతంగా బ్రతికేయవచ్చు.

మంచి ఆహారం, కంటికి నిండా నిద్రా అంటే సరిపడా నిద్ర ఉంటే జీవితం సంతోషమయం అవుతుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే తినే తిండి విషయంలో, తాగే ద్రవ పదార్థాల విషయంలో కాసిన్ని చిట్కాలు తీసుకుంటే రోగాలకు దూరంగా ఆరోగ్యవంతంగా బ్రతికేయవచ్చు.
 
ద్రవ పదార్థాల మాట ఎత్తగానే ముందుగా అందరికీ పళ్లరసాలే గుర్తుకు వస్తాయి. పళ్ల రసాలు కాకుండా ఆరోగ్య సంరక్షణకు ఉపకరించే ద్రవ పదార్థం టీ అని చెప్పవచ్చు. ఆకుపచ్చని లేదా నల్లని (మూలికలు కావు) రకం తేయాకు క్యాన్సర్ వ్యాధికి నిరోధకంగా పనిచేస్తుందని ఓ అధ్యయనం రుజువు చేసింది.
 
క్యాన్సర్ వ్యాధి సోకకుండా నిరోధించడం లేదా క్యాన్సర్‌ని కలిగించే కారకాలను నిర్జీవం చేయడంలో ఆకుపచ్చని, నల్లని తేయాకుతో తయారు చేసే టీ ఉపకరిస్తుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఈ తేనీరులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్త నాళాలలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని కూడా అరికట్టి రక్తప్రసరణకు ఎంతగానో దోహదం చేస్తుంది.
 
అయితే ఎంత మోతాదులో టీ తీసుకోవాలి అనే విషయంలో ఇంకా శాస్త్రవేత్తలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అయినా కూడా రోజుకి రెండు లేదా మూడుసార్లు తీసుకోవటం ఉత్తమం. టీలో పాలను చేర్చడంవల్ల పాలలోని ప్రొటీన్లు.. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లను చుట్టేస్తాయి. దీంతో పాలను చేర్చిన టీ నిరుపయోగం అవుతుంది. కాబట్టి పాలు లేకుండా తేయాకుతో మాత్రమే టీ తయారు చేసుకోవాలి. అది కూడా సన్నని సెగపై కాచినట్లయితే మరీ మంచిది. ఎందుకంటే తేయాకులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు నీటిలోకి విడుదల కావడానికి మూడు నిమిషాల సమయం పడుతుంది కాబట్టి సన్నని వేడిపై టీని తయారు చేసుకోవాలి.