ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Modified: బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:59 IST)

గర్భాశయ క్యాన్సర్‌కి థెరపీతో చెక్...

మహిళలను ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్(HPV)గా ఫలితంగా ఏర్పడే గర్భాశయ క్యాన్సర్. ఈ క్యాన్సర్‌ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో మెక్సికోకు చెందిన డాక్టర్ ఎవా రామన్ గల్లేగాస్ గత 20 ఏళ్లుగా ఈ వైరస్‌‌ నియంత్రణకి సంబంధించి నేషనల్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్(IPN)కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ (ENCB)లో అన్ని రకాల పరిశోధనలూ చేస్తూ హెచ్‌పీవీని 100 శాతం నియంత్రించగలిగే థెరపీని కనుగొన్నారు. 
 
ఫొటోడైనమిక్ థెరపీలో స్పెషలిస్ట్‌గా హెచ్‌పీవీపై ఎన్నో పరిశోధనలు చేస్తున్న ఆమె ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న హెచ్‌పీవీ, గర్భాశయ క్యాన్సర్‌‌లను ముందుగా గుర్తించడం, వాటిని పూర్తిగా నియంత్రించడంలో ఫొటోడైనమిక్ థెరపీ సత్ఫలితాలను ఇస్తోందని తెలియజేసారు. ఈ థెరపీ కేవలం శరీరంలో హెచ్‌పీవీ వల్ల నష్టపోయిన కణాలను మాత్రమే తొలగిస్తుందని, దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవనీ ఆమె పేర్కొన్నారు. 
 
కాగా.. ప్రపంచంలో 100 రకాల హెచ్‌పీవీ వైరస్‌లు ఉన్నాయి. వీటిలో 14 రకాల హెచ్‌పీవీలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్)కు కారణం అవుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను ఎదుర్కొనే శక్తి ఫొటోడైనమిక్ థెరపీకి ఉండడం చాలా ఆనందకరంగా ఉంది.