గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By preeti
Last Modified: మంగళవారం, 1 ఆగస్టు 2017 (18:02 IST)

చిటికెలో నిద్రలోకి జారుకోవడానికి అద్భుతమైన టెక్నిక్...

సాధారణంగా కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా ఆఫీసులో కునికిపాట్లు మరియు తలనొప్పి తప్పవు. అయితే నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల కావచ్చు లేదా స్మార్ట్‌ఫోన్‌ల వలన కావచ్చు మనిషి నిద్రపోయే సమయం తగ్గిపోతోంది

సాధారణంగా కంటి నిండా నిద్ర లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతాడు. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోయినా ఆఫీసులో కునికిపాట్లు మరియు తలనొప్పి తప్పవు. అయితే నేటి ఆధునిక కాలంలో ఒత్తిడి వల్ల కావచ్చు లేదా స్మార్ట్‌ఫోన్‌ల వలన కావచ్చు మనిషి నిద్రపోయే సమయం తగ్గిపోతోంది. దీని వలన అనేక రోగాల బారిన పడుతున్నారు. 
 
ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టదు. అలాంటప్పుడు ఈ '4-7-8 బ్రీతింగ్ టెక్నిక్' మీకు బాగా ఉపయోగపడుతుంది. హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఆండ్రూ వెయిల్ ఈ ట్రిక్‌ను క‌నుగొన్నారు. నోటి లోప‌ల పై భాగాన్ని ట‌చ్ చేసేలా నాలుక‌ను ఉంచాలి. ఆ తర్వాత 4 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోపలికి పీల్చాలి. 
 
అనంత‌రం 7 సెక‌న్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ను లోప‌ల అలాగే బంధించాలి. త‌ర్వాత 8 సెకన్లు కౌంట్ చేస్తూ శ్వాస‌ మొత్తాన్ని నోటి ద్వారా పెద్ద‌గా విజిల్ సౌండ్ మాదిరిగా వ‌చ్చేలా గాలిని బ‌య‌ట‌కు వ‌ద‌లాలి. ఇలా రోజుకు 2 నుండి 4 సార్లు చేస్తే మీలో మార్పును గ‌మ‌నిస్తారు. కేవలం కొన్ని సెకన్లలోనే నిద్రలోకి జారుకుంటారు. మీరు ఆందోళనగా ఉన్నప్పుడు ప్రతిస్పందించడానికి ముందు దీన్ని పాటించండి. టెన్షన్‌గా ఉన్నప్పుడు చేయండి. ఉపశమనం దొరుకుతుంది.