బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (18:42 IST)

బీట్ రూట్ ఆకులు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో?

బీట్ రూట్ ఆకులులో పలు పోషకాలు వున్నాయి. వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ వైరస్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. బీట్ రూట్ ఆకులను ఆహారంలో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తాజా బీట్ రూట్ ఆకుల్లో విటమిన్ సి వంటి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరంపై దాడి చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
వీటి ఆకులు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
బీట్‌రూట్ ఆకుకూరలు క్యాన్సర్‌ను అభివృద్ధి చేసే కణాలను నిరోధించి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
బీట్ రూట్ ఆకుల్లోని నైట్రిక్ ఆక్సైడ్ అనేది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బీట్ రూట్ ఆకులు దోహదం చేస్తాయి.
మధుమేహం వల్ల వచ్చే కొన్ని సమస్యలను కూడా బీట్ రూట్ ఆకులు నివారిస్తాయి.
ఆ ఆకుల్లో తక్కువ కేలరీలు వుండటం వల్ల శరీరానికి మెదడుకు, మానసిక ఆరోగ్యానికి తోడ్పాటునందిస్తాయి.
గుండె సంబంధిత వ్యాధులను రాకుండా అడ్డగించడంలో ఇవి మేలు చేస్తాయి.