ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 3 ఫిబ్రవరి 2024 (23:27 IST)

గోధుమ రవ్వ ఉప్మా ఎందుకు తినాలంటే?

upma
గోధుమల ద్వారా తీసిన గోధుమ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయి. గోధుమ రవ్వ వలన కలిగే ప్రయోజనమేమిటో తెలుసుకుందాము.  గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పాలిచ్చే తల్లులు పాలలో కలిపి తినాలి. కొందరికి గోధుమ రవ్వ జీర్ణవ్యవస్థకు ఆటంకం కలిగించవచ్చు, అలాంటివారు కొన్ని రోజులు దానిని తినడం ఆపాలి.
 
గోధుమ రవ్వ పదార్థం తింటుంటే శరీరంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గోధుమ రవ్వ పదార్థాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
గోధుమరవ్వతో చేసిన పదార్థాలకు వాంతులు ఆపే శక్తి వుంది.
గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల స్థూలకాయం తగ్గి బరువు అదుపులో ఉంటుంది.
గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి.
గోధుమరవ్వ పదార్థాలు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతాయి.
చర్మాన్ని మెరిసేలా ఉంచడంలో గోధుమ రవ్వ పదార్థం సహాయపడుతుంది.
గోధుమ రవ్వ వంటకం వ్యాధి నిరోధకత బాగా పెంచుతుంది.