శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (12:16 IST)

శాకాహారం తీసుకోంటే ఆ సమస్యలుండవ్?

మాంసాహారంతో శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభించినా.. కేవలం శాకాహారం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం చాలామటుకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. శాకాహా

మాంసాహారంతో శరీరానికి కావలసిన ప్రోటీన్లు లభించినా.. కేవలం శాకాహారం తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. తద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం చాలామటుకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. శాకాహారంతో లిపోప్రోటీన్ సాంద్రతల స్థాయి తగ్గి కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. 
 
కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్లు, గింజలు ఆహారంగా తీసుకోవడం ద్వారా పీచు, సోయా ప్రోటీన్లు, కొలెస్ట్రాల్ తగ్గించే స్టెరాల్స్ శరీరంలోకి చేరి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు, పెరుగు వంటి జంతుసంబంధ ఆహారం లేని శాకాహారం తీసుకోవడం వల్ల బరువు, కొలెస్ట్రాల్‌, రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 
ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవడం ద్వారా వ్యాధులను నిరోధిస్తాయి. వీటివలన శరీరానికి కావాల్సిన వివిధ విటమిన్లు అందుతాయి. కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్, కీళ్ల నొప్పులు, మధుమేహం వంటి రోగాలను నయం చేస్తాయి. అంతేకాదు వృద్ధాప్య ఛాయసలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.