శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (11:54 IST)

కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. రాగులు తీసుకోండి..

మధుమేహం నియంత్రణకు రాగులు భేష్‌గా పనిచేస్తాయి. క్యాల్షియం..ఐరన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా వుండటం చేత మధుమేహులకు, ఊబకాయులకు రాగులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి.

మధుమేహం నియంత్రణకు రాగులు భేష్‌గా పనిచేస్తాయి. క్యాల్షియం..ఐరన్ వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా వుండటం చేత మధుమేహులకు, ఊబకాయులకు రాగులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన ట్రిప్టోథాన్, వాలైన్, మెధియోనైన్, ఐసోల్యూసిస్, ధ్రియోనైన్ వంటి ఆమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి.  అధిక బరువు తగ్గడానికి రాగుల్లోని ట్రిప్టోధాన్ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ట్రిప్టోధాన్ అమైనో ఆమ్లం శారీరక, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది.
 
మధుమేహం నియంత్రణకు రాగుల్లోని ఫైటో కెమికల్స్ జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు తోడ్పడుతాయి. కొలెస్ట్రాల్ తగ్గేందుకు, కొవ్వును నిర్మూలిస్తుంది. థ్రియోనైన్ అమైనో ఆమ్లమైతే కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా చూస్తుంది. అధిక బరువు తగ్గేందుకు రాగుల్లోని ట్రిప్టోధాన్ అనే ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది. దీంతో బరువు తగ్గుతారు