బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2017 (12:44 IST)

రాత్రిపూట ఛాటింగ్‌లు చేస్తున్నారా? ఫేస్ బుక్ చూస్తున్నారా? ఐతే గోవిందా..?

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఫోన్లు, ట్యాబ్లు, సిస్టమ్‌లలో కూర్చుని కాలం గడిపేస్తుంటారు. అయితే రాత్రి నిద్రపోయేందుకు గంటకు ముందైనా.. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రా

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఫోన్లు, ట్యాబ్లు, సిస్టమ్‌లలో కూర్చుని కాలం గడిపేస్తుంటారు. అయితే రాత్రి నిద్రపోయేందుకు గంటకు ముందైనా.. స్మార్ట్ ఫోన్లను ఉపయోగించవద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రిపూట నిద్రకు ముందు టీవీలు చూస్తూ, ఫోన్లతో కాలం గడుపుతూ ఉన్న వారికి అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
బరువు పెరగడానికి కారణం.. నిద్రించేముందు మొబైల్, లాప్ టాప్.. ఇతరత్రా వాడుతుండమేనని పరిశోధనల్లో కూడా తేలింది. కృతిమ లైట్ మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, కృత్రిమ లైట్‌ వాడకం క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్‌ సెల్స్‌మీద ప్రభావం చూపి విపరీతంగా బరువు పెరగడానికి దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. ఫేస్ బుక్ చూడటం, ఛాటింగ్‌లు చేయడం.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండటం ద్వారా ఆ వెలుగులోనే రాత్రి సమయంలో ఎక్కువగా కళ్లకు పనిచెప్తారు. అంతేగాకుండా పనిచేసుకుంటూ ఏదో ఒక జంక్ ఫుడ్ తీసుకుంటుంటారు. ఈ సమయంలో తీసుకొనే ఆహారానికి పరిమితులుండవు. అందుకే ఒబిసిటీ తప్పదు. ఇంకా నిద్రించేందుకు ముందు.. ఇలాంటి వస్తువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పరిశోధకులు అంటున్నారు. ఇంకా రాత్రిపూట ఫోన్లను ఉపయోగించడం ద్వారా కళ్లకు కూడా దెబ్బేనని వారు హెచ్చరిస్తున్నారు.