సోమవారం, 28 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:51 IST)

అక్కడ చేరిన కొవ్వును కరిగించుకోవాలంటే? బొప్పాయి- గ్రీన్ టీని?

బొప్పాయి, క్యారెట్, టొమాటో, చిలగడదుంపలతో పాటు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీని సేవించడం ద్వారా పిరుదుల దగ్గర విపరీతం చేరిన కొవ్వును కరిగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో అధిక వ్యర్థాలు

బొప్పాయి, క్యారెట్, టొమాటో, చిలగడదుంపలతో పాటు రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీని సేవించడం ద్వారా పిరుదుల దగ్గర విపరీతం చేరిన కొవ్వును కరిగించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరంలో అధిక వ్యర్థాలు పేరుకుపోవడం, కొవ్వు విపరీతంగా చేరడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే.. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తీసుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా మార్పు లభిస్తుంది.  
 
గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే వారు ఎదుర్కొనే ఈ సమస్య నుంచి గట్టేక్కాలంటే., రోలింగ్‌ వ్యాయామాలు చేయాలి. పిరుదుల మీద భారంవేస్తూ అటూ, ఇటూ కదిలే ప్రయత్నం చేయాలి. ఆ ప్రాంతంలో రక్తప్రసరణ బాగా పెరిగి కొవ్వు కరుగుతుంది. అలాగే సైకిలు ఎక్కువగా తొక్కడం వల్ల కూడా ఆ సమస్య అదుపులో ఉంటుంది. రోజూ ఆహారం తీసుకునేందుకు ముందు ఒక గ్లాసు నీరు తాగాలి. బ్లాక్ కాఫీ తాగాలి. క్యాప్సికమ్, మిరియాలు చేర్చిన ఆహారాన్ని తీసుకోవాలి. ఏరోబిక్స్ వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.