శనివారం, 14 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 జూన్ 2024 (18:36 IST)

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

pumpkin
గుమ్మడి విత్తనాలు. ఈ విత్తనాలు తినడం వలన కలిగే ఆరోగ్య ఫలితాలను తెలిస్తే వాటిని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటాము. గుమ్మడిలో న్యూట్రీషియన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. గుమ్మడి గింజలు తింటుంటే కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. 
గుమ్మడి గింజలు క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తాయని నిపుణులు చెపుతున్నారు.
ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది.
గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది.
గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను ఉపయోగించడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుమ్మడి గింజల్లో వివిధ రకాల నొప్పులను నివారించగలిగే యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
రక్తం పలుచగా వుండేవారు గుమ్మడి గింజలకు దూరంగా వుండాలి.