మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 మే 2021 (21:11 IST)

ఆ ఆరోగ్య సమస్యలను నిలువరించే కిస్‌మిస్, మిస్ చేయవద్దు

కిస్‌మిస్ పండ్లలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందువలన దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్లను రక్షిస్తుంది. ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ పైటో న్యూట్రియంట్స్ ఉండడం వలన యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే బీటా కెరొటిన్, కెరొటనాయిడ్స్ కళ్లకు ఎంతో మేలు చేస్తాయి.
 
శృంగార శక్తిని పెంచే అమినో యాసిడ్ ఆర్జినిన్ ఇందులో ఉన్నది. ఇది శృంగార సమయంలో బలహీనత లేకుండా సమర్థవంతంగా పాల్గొనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కిస్‌మిస్‌లో ఉన్న ప్రక్టోజ్, గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువుని పెంచే దిశగా శక్తి మూలకముగా పని చేస్తుంది. తక్కువ బరువు కలవారు ఎండుద్రాక్షను తింటే మంచిది.
 
కిస్‌మిస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉన్నందు వలన విరోచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు కిస్‌మిస్ తింటే సరిపోతుంది. కిస్‌మిస్ పండ్లను తరచుగా తినడం వలన శరీరములో పులుపును స్వీకరించే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది.
 
200 మిల్లీగ్రాముల పాలతో 50 గ్రాముల కిస్‌మిస్ పండ్లు తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు, దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి.