సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (23:04 IST)

తలనొప్పి, కళ్లు మంటలుగా వుంటే కరక్కాయను అరగదీసి అప్లై చేస్తే...

కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధ పడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. 
 
వాంతులవుతున్నప్పుడు కరక్కాయపొడిని మంచినీళ్లలో తీసుకుంటే  వాంతులు తగ్గుతాయి. మలబద్దకంతో బాధపడేవారు కరక్కాయను వాడటం వలన విరోచనం సాఫీగా అవుతుంది. ఇది వాతాన్ని హరిస్తుంది. తరచూ తలనొప్పితో బాధపడేవారు కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి, కళ్లమంటలు తగ్గుతాయి.
 
కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పుచేర్చి పండ్లు తోముకొనిన చిగుళ్లు దృఢపడి పంటివ్యాధులు రావు.  పిప్పి పన్నుపోటు కూడా తగ్గుతుంది.