1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 11 ఫిబ్రవరి 2023 (18:12 IST)

దానిమ్మ పూలతో కషాయం, ఫలితాలు ఏమిటి?

దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర ఔన్సు తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
 
దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది.
 
దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు.
 
దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది.
 
రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది.
 
గుండె ఆరోగ్యానికి దానిమ్మ పూలు మేలు చేస్తాయి.
 
బరువు తగ్గాలనుకునేవారు దానిమ్మ పూలు కషాయం తాగితే ఫలితం వుంటుంది.