పుట్టగొడుగులు తింటే కొలెస్ట్రాల్ ఏమవుతుంది?
పుట్టగొడుగులు పోషకమైనవి అయినప్పటికీ, ప్రతి ఒక్కరూ వాటిని తినలేరు. పుట్టగొడుగుల్లో వుండే పోషకాల వివరాలతో పాటు వీటిని ఎవరు తినకూడదో తెలుసుకుందాము. పుట్టగొడుగులు సులభంగా జీర్ణం కావడమే కాకుండా మలబద్ధకాన్ని నిరోధించే గుణాలను కూడా కలిగి ఉంటాయి. రక్తంలోని అదనపు కొవ్వును కరిగించి రక్తాన్ని శుద్ధి చేసే గుణం పుట్టగొడుగులకు ఉంది.
అధిక రక్తపోటు, రక్తనాళాల గోడలపై కొవ్వు నిల్వలను నివారిస్తుంది. పుట్టగొడుగులు తల్లి పాలు ఎండిపోయేట్లు చేస్తాయంటారు కనుక పాలిచ్చే స్త్రీలు వాటిని తినరాదు. బరువు తగ్గాలనుకునే వారు పుట్టగొడుగులను తినకూడదని సూచిస్తున్నారు.
పుట్టగొడుగులలో ప్యూరిన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి కీళ్లనొప్పులు ఉన్నవారు వాటిని ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. చర్మ అలెర్జీ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను తినకూడదు.