అరటి పండ్లు ఎవరు తినకూడదో తెలుసా?
అరటి పండ్లు. ప్రతి ఒక్కరికి చౌకైన, పోషకాహార పరంగా అందుబాటులో వుంటుంది ఈ అరటిపండు. ఐతే ప్రత్యేకించి కొన్ని అనారోగ్య పరిస్థితులున్నవారు, ఆరోగ్య సమస్యలున్నవారు అరటి కాయలు తినరాదు. ఎవరు తినకూడదో తెలుసుకుందాము. కిడ్నీ సమస్యలున్నవారు అరటిపండ్లకు దూరంగా వుంటే మంచిది. కారణం, అరటి పండ్లలో పొటాషియం కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.
అనారోగ్య సమస్యలు లేనివారు సైతం రోజుకి ఒకట్రెండు మించి తినరాదు, తింటే జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు. మధుమేహ సమస్యతో బాధపడుతున్నవారు అరటి పండ్లకు దూరంగా వుండాలి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు అరటి పండ్లను తింటే మరింత బరువు పెరిగే ప్రమాదం వుంది.
హైపర్కలేమియా అనారోగ్య సమస్య వున్నవారు అరటి పండు తింటే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం వుంది. మైగ్రేన్ సమస్య వున్నవారు అరటి పండ్లను తినకపోవడమే మంచిది. తింటే సమస్య తీవ్రమవుతుంది.