శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (13:47 IST)

#WorldEggDay2020 రోజుకో కోడిగుడ్డు తింటే..?

Eggs
#WorldEggDay2020 సందర్భంగా కోడిగుడ్డు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి ఇది సహాయపడుతుంది. కోడిగుడ్డులోని మంచి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందువల్ల, ఇది కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
 
కంటి ఆరోగ్యానికి కోడిగుడ్డు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే రోజుకు ఒక కోడిగుడ్డును తీసుకుంటే.. బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. అల్పాహారంలో తప్పకుండా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది. కోడిగుడ్లను రోజూ తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అందుకే పెరిగే చిన్నారులకు రోజుకు ఓ కోడిగుడ్డును ఇవ్వడం చేయాలి. 
 
ఇకపోతే.. ప్రపంచ కోడిగుడ్ల దినోత్సవాన్ని అక్టోబర్ 9న జరుపుకుంటారు. 1996 సమావేశంలో ఈ రోజును గుర్తించడం జరిగింది. ఈ రోజున, ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో రెండవ శుక్రవారం ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.