శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 మార్చి 2020 (10:22 IST)

మొలకలు తీసుకుంటే.. మధుమేహం పరార్..

మొలకలు తీసుకుంటే మధుమేహం మటాష్ అవుతోందని.. మొలకలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిల్లో వుండే పొటాషియం శరీరంలోని నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటిల్లో వుండే యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. మొలకలు ఎముకలను దృఢంగా మారుస్తాయి. మొలకల్లోని విటమిన్ - ఎ వల్ల కంటిచూపు మెరుగుపడుచుంది. 
 
రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. శరీరానికి పీచు చాలా అవసరం. మొలకల ద్వారా దీన్ని భర్తీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మొలకల్లో వుండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరాన్ని అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. గుండెజబ్బులను తగ్గిస్తుంది. వీటిలోని లో కెలోరీలు బరువును తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.