శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (17:06 IST)

ఉసిరికాయ గుజ్జు, పసుపుతో మధుమేహం మటాష్

ఉసిరికాయ గుజ్జు, పసుపు ముద్దను తీసుకుంటే డయాబెటిస్‌ను తరిమికొట్టవచ్చు. అలాగే మామిడి ఆకుల రసానికి… ఆల్ఫా గ్లోకోసిడేస్ అనే ఎంజైమ్‌ని నిరోధించే శక్తి ఉంది. దానివల్ల మామిడి ఆకుల రసం తాగితే… బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. షుగర్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించాలంటే దాల్చిన చెక్క పొడిని రోజో అర స్పూన్ తీసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
 
అలాగే ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టమైన అవిసె గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చెయ్యడంలో సహాయ పడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులు బెర్రీస్, దానిమ్మలు, ఉసిరి వంటివి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవచ్చు. రోజుకో ఆపిల్ పండు తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.