మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 27 సెప్టెంబరు 2018 (09:49 IST)

ఫిట్‌నెస్‌కు మించిన శక్తి యోగా అందిస్తుంది... ఎలాగో తెలుసా?

అత్యాధునిక పరికాలతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి పాశ్చాత్య సంగీతాన్ని వింటూ శరీరపు ఫిట్‌నెస్‌ను చక్కదిద్దే కార్యక్రమాలు ఉండగా యోగసాధన మాత్రమే ఎందుకు చేయాలి అనే సందేహం ఎవరికైనా తలెత్తవచ్చును. సందేహ నివృత్తిలో భాగంగా ఫిట్‌నెస్ కార్యక్రామాలకు, యోగసాధనకు

అత్యాధునిక పరికాలతో ఆకర్షణీయమైన దుస్తులు ధరించి పాశ్చాత్య సంగీతాన్ని వింటూ శరీరపు ఫిట్‌నెస్‌ను చక్కదిద్దే కార్యక్రమాలు ఉండగా యోగసాధన మాత్రమే ఎందుకు చేయాలి అనే సందేహం ఎవరికైనా తలెత్తవచ్చును. సందేహ నివృత్తిలో భాగంగా ఫిట్‌నెస్ కార్యక్రామాలకు, యోగసాధనకు గల తేడాలు తెలుసుకుందాం.
 
ఫిట్‌నెస్ కార్యక్రమాలు పరిమిత లక్ష్యానికి మాత్రమే నిర్దేశించబడి ఉంటాయి. యోగసాధన మానవునికి సంపూర్ణత్వాన్ని ప్రసాదించే పూర్తి స్థాయిని కలిగిఉంటుంది. కేవలం శారీరక ఆరోగ్యానికి మాత్రమే ఫిట్‌నెస్ పరిమితం కాగా, యోగాతో మనిష శారీరక, మానసిక శక్తిని పూర్తిగా అందదేస్తుంది. దినసరి ప్రామాణికాలకు లోబడి యోగసాధనతో రోజురోజుకు మీరు చవిచూసే మార్పులు మీకు దివ్యానుభూతిని కలిగిస్తాయి.
 
యోగసాధనలో అంతర్గత శక్తులను చైతన్యపరిచి మానసిక ఆనందాన్ని పొందే మార్గంలో సాధకునికి పోటీ ఎవరు ఉండరు. యోగ సాధనతో శారీరక విశ్రాంతి లభిస్తుంది. రోజువారీ లక్ష్యాలను మీరు చేరుకోనట్లైతే ఫిట్‌నెస్ కార్యక్రమంలో మీరు పరాజితులు. ఐతే సాధన చేసే కొన్ని అనిర్వచనీయ ఫలితాలను యోగా అందిస్తుంది.
 
ఫిట్‌నెస్ కార్యక్రమాలు కండరాలను పెంచి భారీ రూపాన్ని కల్పిస్తే, యోగసాధన అమూల్యమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఫిట్‌నెస్ కార్యక్రమాల ముగింపులో మీరు అలసటను సాధిస్తారు. అదే యోగసాధన చివరి ఘట్టంలో మానసిక ఉల్లాసాన్ని, నిర్మలత్వాన్ని సంతరించుకుంటారు.