రక్తపోటు భారతం... 20 కోట్ల మందికి హైబీపీ : లండన్ శాస్త్రవేత్తలు
దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు ప
దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితులు వందకోట్లకు పైగానే ఉన్నట్లు ఈ శాస్త్రవేత్తలు భారీ స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. గత 40 ఏళ్ల కాలంలో ఈ తరహా బాధితుల సంఖ్య రెట్టింపైనట్లు తేల్చారు.
2015లో ప్రపంచంలోని అధిక రక్తపోటు బాధితులైన వయోజనుల్లో సగానికిపైగా ఆసియాలోనే ఉన్నట్లు గుర్తించారు. చైనాలో సుమారు 22.6 కోట్ల మంది ఉండగా, భారత్‌లో 20 కోట్లమంది ఉన్నట్లు పేర్కొన్నారు.